![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1091 లో....అసలు రాజుకి ఆక్సిడెంట్ చేయించింది మన రేఖ పిన్ని అని నందుతో ఇందు చెప్తుంది. నిజం తెలిసినా ఇంత సైలెంట్ గా ఎందుకు ఉన్నావ్ వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నందు అనగానే నీకు ఇప్పుడు చెప్పింది ఈ విషయంలో కలుగజేసుకోకని చెప్పడానికి మాత్రమే అని ఇందు అనగానే అలా అంటావేంటి అక్క అని నందు అంటుంది. మన దగ్గర సాక్ష్యం లేవు.. నేను చేప్పింది విను అని అక్కడ నుంచి ఇందు వెళ్తుంది.
నేను అసలు వదిలి పెట్టను అక్క అని నందు అనుకుంటుంది. ఆ తర్వాత వెంకీకి నందు ఫోన్ చేసి నాకు నీ హెల్ప్ కావాలని అంటాడు. మీ అన్నకి జరిగిన ఆక్సిడెంట్ ఎవరో కావాలని చేశారనిపిస్తుంది ఇంకొకసారి అలా జరగకుండా జాగ్రత్త పడాలి కదా అని నందు అనగానే సరే అని వెంకీ అంటాడు. మరొకవైపు ఇందు దగ్గరికి శృతి వస్తుంది. ఎదురుగా ఐశ్వర్య ఉంటుంది. శృతిని చూసి ఏంటి సరాసరి ఇంట్లోకి వస్తున్నావని ఐశ్వర్య అడుగుతుంది. ఇందు మేడం దగ్గర డబ్బు తీసుకుందామని వచ్చానని శృతి అనగానే డైరెక్ట్ గా ఇంటికి వస్తావా అని ఐశ్వర్య కోప్పడుతుంటే ఏంటి ఎక్సాట్రాలు మాట్లాడుతున్నావని నందు వస్తుంది. నువ్వు ఏంటే నాకు ఎదురు మాట్లాడుతున్నావని నందుని ఐశ్వర్య కొట్టబోతుంటే ఇందు వచ్చి ఆపుతుంది. శృతికి డబ్బు ఇచ్చి ఇందు పంపిస్తుంది. ఏంటి తనతో అలా మాట్లాడుతున్నావని ఐశ్వర్యపై ఇందు సీరియస్ అవుతుంది. నీకు ఏం తెలుసు కష్టం విలువ ఇంట్లో కూర్చొని వాళ్ళని వీళ్ళని డబ్బు అడుగుతు ఉంటావని ఐశ్వర్యని రెచ్చ గొట్టేలా ఇందు, నందు మాట్లాడుతారు. ఇక కోపంతో ఐశ్వర్య అక్కడ నుంచి వెళ్తుంది. ఏంటి మీ చెల్లిని అలా ఏడిపిస్తున్నారని రాజు అనగానే తనతో అలా అంటేనే సెట్ అవుతుందని ఇందు అంటుంది.
ఆ తర్వాత రాజు ఫోన్ చేసి లక్కీని రమ్మని చెప్తాడు. లక్కీ బ్యాగ్ తో వస్తాడు. ఈ రోజు నుంచి లక్కీ నాతోనే ఉంటాడని రాజు అనగానే అవసరం లేదని భ్రమరాంబ అంటుంది. నువ్వు ఎవరు చెప్పడానికి అసలు పిన్ని ఎక్కడ అని రాజు అనగానే అప్పుడే రేఖ వస్తుంది. పిన్ని మన లక్కీ అని రాజు అనగానే రేఖ షాక్ అవుతుంది. పాపం లక్కీ గాడికి ఎవరు లేరు.. వాళ్ళ అమ్మని రేఖ పిన్ని వెతుకుతుందని రాజు చెప్తాడు. తరువాయి భాగంలో లక్కీ తల్లి రేఖ పిన్ని అన్న నిజాన్ని ఇందుకి రాజు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |